![]() |
![]() |

న్యూస్ రీడర్స్ లో చాలా స్పెషల్ గా చూడగానే చాలా అందంగా పర్ఫెక్ట్ జర్నలిస్ట్ అనిపించేలా ఉండే టీవీ 9 న్యూస్ రీడర్ ప్రత్యూష గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వార్తలు చదివే విధానం కూడా చాలా వినసొంపుగా ఉంటుంది. ఐతే ఆమె కే.విశ్వనాధ్ గారి మూవీని రిజెక్ట్ చేసిన విషయం రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. "ఒక రోజు కే .విశ్వనాధ్ గారి ఆఫీస్ నుంచి నాకు ఒక కాల్ వచ్చింది. సర్ మీ ప్రోగ్రాం ఒకటి చూశారట మిమ్మల్ని కలుస్తాను అన్నారు . నేను ఆయనకు పెద్ద ఫ్యాన్ . ఎందుకంటే కాలేజ్ టైములో ఆల్ రౌండర్ అవార్డుని ఆయన చేతుల మీదగాని అందుకున్నా. మా అమ్మకు కూడా ఆయన మూవీస్ అంటే చాలా ఇష్టం. అందుకే నాకు మ్యూజిక్ , డ్యాన్సింగ్ నేర్పించింది. అలాంటి ఆయన పిలిచారని ఆనందంతో వెళ్లాను. చాలా బాగున్నావమ్మా చూడడానికి తెలుగు పిల్లలా లేవు...కానీ తెలుగు బాగా మాట్లాడుతున్నావు . అయ్యో సర్ మాది పశ్చిమ గోదావరి .
తెలుగు బాగా మాట్లాడతాను. అప్పుడు ఆయనకు ఒక స్టోరీ చెప్పారు. ఎందుకు చెప్తున్నారా అనుకున్నాను. ఆ మూవీలో హీరోయిన్ అనుకుంటున్నాను ఆడిషన్ చేద్దామా అన్నారు. సర్ అసలు ఏ రకంగానూ మీ హీరోయిన్లకు మ్యాచ్ అవ్వను. " అని చెప్పాను. "సాగరసంగమం, స్వర్ణ కమలం లాంటి సినిమా కాదు ఒక మార్షల్ ఆర్ట్స్ తెలిసిన అమ్మాయి. ఆసిడ్ అటాక్స్ కి సర్వైవ్ ఐన అమ్మాయి. ఐతే సోనమ్ కపూర్ ని శృతి హాసన్ ని చేయించమని అనిల్ కపూర్ కి కమల్ హాసన్ కి చెప్పాను. ఐతే వాళ్ళు కమర్షియల్ మూవీతో లాంచ్ అవుదామనుకున్నారు. వాళ్ళ ముక్కు నీ ముక్కు ఒకేలా ఉంది అందుకే పిలిచాను అన్నారు. ముక్కు కీ రోల్ ప్లే చేస్తుందని అప్పుడు తెలిసింది. ఐతే ఈ మూవీ చేస్తావా అన్నారు. అప్పటికి నాకు పెళ్ళై రెండు నెలలయింది. మా ఇంట్లో వాళ్లకు చెప్పాలి అన్నాను. ప్రొడ్యూసర్ ని ఇచ్చి ఇంటికి పంపించి మాట్లాడమన్నారు. వాళ్లేమో తన ఇష్టం అండి అన్నారు. చాలా నమ్మకం ఇచ్చారు. ఇందులో కిస్ సీన్లు , హగ్ సీన్లు ఉండవు అన్నారు. అల్లరి నరేష్ గారి మూవీ శుభప్రదం అని. తర్వాత ఆయన కాళ్ళ మీద పడి దణ్ణం పెట్టి మీ లాంటి వాళ్ళు పిలిచి అవకాశం ఇచ్చారు. కానీ నాకు నటన మీద అంత ఇంటరెస్ట్ లేదు అని చెప్పాను. ఆ తర్వాత ఆ మూవీకి మంజరి ఫడ్నవీస్ చేసింది." కానీ ఇది నా లైఫ్ లో గుర్తుండిపోయే ఒక మెమరీ.
![]() |
![]() |